TEJA NEWS

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని కలిసిన టీడీపీ గ్రామ కమీటీల నూతన కార్యవర్గ ప్రతినిధులు.

వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించిన మేరకు ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ విధివిధానాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యవర్గాలను ఎన్నుకుంటున్నారు. ఇటీవల జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామం, ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామ టీడీపీ శాఖల కార్యవర్గాలను ఆయా గ్రామాల్లో ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నిక కాబడిన తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖల కార్యవర్గాల ప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు, మైలవరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారిని శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కుంటముక్కల గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షునిగా యడవల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా బార్లపూడి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగాల జోజిబాబు, కోశాధికారిణిగా బార్లపూడి ఏసుమ్మ, కార్యదర్సులుగా మైలవరపు శ్రీహరి, సుఖభోగి జోజిబాబు, నక్కా జమలయ్య, కార్యనిర్వహణ కార్యదర్సులుగా సందిపాము జయలక్ష్మీ, లింగాల చిన్న వెంకటేశ్వరరావు, బడుగు తిరుపతమ్మలు ఎన్నికయ్యారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షునిగా కాకి నాగరాజుగ్రామ పార్టీ ఉపాధ్యక్షునిగా పెసల రమేష్, గ్రామ పార్టీ సెక్రటరీగా నిమ్మగడ్డ చంద్రశేఖర్, గ్రామ తెలుగు యువత ప్రతినిధిగా ఆళ్ల నరసింహారావు (బుల్లెచ్చయ్య), గ్రామ బీసీ సెల్ అధ్యక్షునిగా ఎడ్ల రాంబాబు, గ్రామ ఎస్సీ సెల్ ప్రతినిధిగా కొంక శ్రీనివాసరావు, గ్రామ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా మాకాని వెంకాయమ్మ, తెలుగు రైతుఅధ్యక్షునిగా జాస్తి మోహనరావు, గ్రామ ఐటీడీపి అధ్యక్షునిగా నక్కా సునీల్ ఎన్నికయ్యారు. వీరందరూ శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారిని కలిశారు. వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ మరింత పటిష్ట పరచడానికి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వారికి సూచించారు.