
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో వివిధ హోటల్స్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హోటల్స్ లో ఫుడ్ కలర్ మరియు టెస్టింగ్ సాల్ట్ నిషేధమని తెలిపారు. వివిధ హోటల్స్ లో శాంపిల్స్ ను తీసుకొని హైదరాబాద్ లేబర్ కి పంపిస్తామని తెలిపారు. ల్యాబ్ లో రిజల్ట్ ప్రకారం ఎవరైతే టెస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
