TEJA NEWS

జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు మాట్లాడుతూ ” దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇది భారతదేశంలోని పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ప్రజల మధ్య సోదరభావాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నారు.

ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది నవంబర్ 26, 1949న పూర్తయింది. ఈ రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది అని అన్నారు. 2015 నుంచే ప్రతీ సంవత్సరం నవంబర్ 26న నిర్వహిస్తూ వస్తున్నాం. ఇందుకు కారణం.. 2015లో భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం. ఆయన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. దీంతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత , రజిత సోషల్ విభాగ ఉపాధ్యాయులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


TEJA NEWS