TEJA NEWS

ప్రగతి నగర్ అంబర్ చెరువులో నూతన డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు కొరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతి నగర్ ప్రజల విన్నపం మేరకు అంబర్ చెరువు కలుషితం కాకుండా నూతన డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు..

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతిపత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సమావేశంలో ప్రగతి నగర్ మాజీ కార్పొరేటర్ ఇంద్రాజిత్ రెడ్డి,నిజాంపేట్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు..