TEJA NEWS

సరికొత్తగా యలమంచిలి జనార్దన రావు దైత మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాల

సాంకేతిక విద్యా విధానంతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూ అనేక దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న సుజనా గ్రూప్ నేడు సుజనా అకాడమీ టెక్నాలజీ అండ్ సైన్స్ తో మచిలీపట్నంలోని
డీ ఎమ్ ఎస్ ఎస్ వి హెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విలీనమైంది.

ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

చిలకలపూడి లోని కళాశాల ఆవరణలో సుజనా గ్రూప్ చైర్మన్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కి విలీన పత్రాలు అందించిన హిందూ విద్యా సంస్థల సొసైటీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు
మెంటార్ గా వ్యవహరించనున్న వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ టీం

ఎమ్మెల్యే సుజనా చౌదరి, గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాదు లతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో నాణ్యమైన విద్య కీలక పాత్ర పోషిస్తుందని మంచి ఫౌండేషన్ తోనే ఉత్తమ విద్య సాధ్యమని పేర్కొన్నారు.
కులమతాలకతీతంగా సమాజం బాగుండాలని విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో విద్యారంగంలో సేవలందిస్తున్నామని తెలిపారు.
మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడిందని రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న బందర్ లో అనేక వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
విద్యార్థులందరూ విజ్ఞానాన్ని పెంచుకోవాలని టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు.
కళాశాలలో మున్ముందు బోధనా పద్ధతుల్లో అభ్యసన విధానాల్లో మార్పు తేవడానికి అపార అనుభవం ఉన్న వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగిందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పాలిటెక్నిక్, డిప్లమా వంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో కళాశాలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.
పూర్వ విద్యార్థులంతా అభివృద్ధికి తోడ్పడి కళాశాలకు పూర్వవైభవాన్ని తెచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రెసిడెంట్ పివి రావు, సిద్ధార్థ కళాశాల వైస్ ఛాన్సలర్ రావు, డైరెక్టర్ బి పాండురంగారావు,
ప్రిన్సిపల్ రవికుమార్, సెక్రటరీ పివి శాస్త్రి, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్, జనసేన మచిలీపట్నం అధ్యక్షులు బండి రామకృష్ణ,ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.