TEJA NEWS

No confidence motion on Orugallu Mayor Gundu Sudharani?

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికల అట్లా ముగిసా యో.. లేదో..! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గురి పెట్టింది కాంగ్రెస్ పార్టీ.

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి క్యూ కడుతున్నారు. ఏకంగా ఓరుగల్లు మేయర్ కూడా అదే రూట్‌లో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్‌ అవుతోంది.

గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఆపరే షన్ ఆకర్ష్ లిస్టులో ఇంకా ఎంతమందున్నారు? గ్రేటర్‌ కుర్చీకి కాంగ్రెస్‌ ఎంత దూ రంలో ఉంది? కుర్చీలాటలో బీఆర్‌ఎస్‌ పట్టు నిలుస్తుం దా? కాంగ్రెస్‌ ఎత్తు ఫలిస్తుం దా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ…

పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.. కానీ వరంగల్ లో మాత్రం పొలిటికల్ హీట్ చల్ల బడడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవిశ్వాసం తీర్మానంపై హాట్ హాట్ చర్చ జరుగుతుంది.

మేయర్ కుర్చీలో కూర్చో బెట్టిన వారే ఇప్పుడు కుర్చీ దింపడానికి కసరత్తు చేస్తున్నారట. ఓరుగల్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాసం ప్రవేశపెట్టేం దుకు వ్యూహాలు రచిస్తు న్నారు. నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లు భేటీ అయి మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చ జరిపారు.

వారికి కలిసివచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట..ఓరుగల్లు మేయర్ పై హటాత్తుగా ఎందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తున్నారు..? ఆమెను మేయర్ పీఠంపై కూర్చో బెట్టిన బీఆర్ఎస్ పార్టే ఇప్పుడు ఆమెను గద్దే దింపేందుకు ఎందుకు కసరత్తు చేస్తుందనే అనుమానం కలుగుతుంది కదూ..?

అవును ఇది నమ్మలేని నిజం బీఆర్ఎస్ పార్టే మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఉవ్వి ళ్ళూరుతోంద. ఆ పార్టీ నుండి గెలుపొంది,గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న గుండు సుధారాణి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గూటికి చేరారు.

దీంతో మేయర్ పై ఆగ్రహం తో ఊగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమై నట్లు చర్చ జరుగుతుంది. ఐతే ఎవరి బలమెంతా..? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరూ..? నెగ్గేదేవరూ..? అనే చర్చ జరుగుతుంది…


TEJA NEWS