- నేత్రపర్వం నీలమేఘశ్యాముని కల్యాణోత్సవం
- పట్టు వస్త్రాలను బహుకరించిన మంత్రి పొంగులేటి, మాధురి దంపతులు
- పాల్గొన్న సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు
…..
అందరి బంధువు… ఆదుకునే ప్రభువు… భద్రాచల రామయ్య కల్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో కనుల పండువగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ తంతులో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు హాజరై నీలమేఘశ్యాముని కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను బహుకరించారు. మంగళ వాయిద్యాలు… వేదవండితుల మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను లక్షలాది మంది భక్తులు తిలకించి పులకించారు. ఈ కల్యాణ క్రతువును మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు కూడా హాజరై వీక్షించారు.