మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు
హైదరాబాద్:
జన్వాడలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దావత్, వ్యవహారం కొత్త మలుపు తిరిగింది, రాజ్ పాకాల పరారీలో ఉండటంతో పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు.
తమ విచారణకు రావా లని, లేకుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని రాజ్ పాకాలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. జువ్వాడ పార్టీ కేసులో విచారణ చేయాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అడ్రస్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని, విచార ణకు సహకరించాలని కోరారు. BNSS యాక్ట్ (35) సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.
హైకోర్టుకు రాజ్ పాకాల…
నిన్నటి నుంచి రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన ఇంటివద్ద కూడా కనిపించ డం లేదు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల పిటీషన్ లో కోరారు.
హైకోర్టులో రాజ్ పాకాల పిటీషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుంద న్నది,మాత్రం తెలియ రాలేదు. దీనికి సంబంధిం చిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.