TEJA NEWS

Officials to provide irrigation water to farmers

రైతులకు సాగునీరు ఇచ్చేందుకు అధికారులు ఉన్న పూర్తిఅధికారాలను ఉపయోగించుకోవాలని ఆదేశించిన…………….మంత్రి జూపల్లి కృష్ణారావు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వనపర్తి :
జిల్లాలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి అధికారులు తమకు ఉన్న పూర్తి అధికారాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ & పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

    వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తో కలిసి విద్యా, వైద్య, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

విద్యా శాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ విధులకు సమయానికి హాజరు కావాలని, ఉపాధ్యాయుల హాజరుపై జిల్లా విద్యాధికారి, లేదా మండల విద్యాధికారి తప్పనిసరిగా పర్యవేక్షణ ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో పంపిణీ చేయాలని, వీటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద ఎంపికైన అన్ని పాఠశాలల్లో పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆధికారులకు, ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు.

విద్యుత్
జిల్లాలో పెండింగ్ లో ఉన్న సబ్ స్టేషనలపై విద్యుత్ అధికారులతో మంత్రి ఆరా తీశారు. 2017-18 లో శాంక్షన్స్ పూర్తి అయి నేటికీ ప్రారంభనికి నోచుకోకపోవడానికి గల కారణాలపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ (రైట్ అఫ్ ఏ) అభ్యంతరాల కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లాలో 13 సబ్ స్టేషన్లు కొత్తవి మంజూరు కాగా 6 సబ్ స్టేషన్లకు పని నడుస్తోందని, 4 సబ్ స్టేషన్లకు పనులకు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయని, ఇంకా రెండు సైట్స్ హ్యాండ్ ఓవర్ దశలో ఉన్నాయని, మరొకటి న్యాయస్థానంలో కేసులో ఉందన్నారు.

గృహజ్యోతి కింద జిల్లాలో కేవలం 63 వేల మందికి మాత్రమే లబ్ది జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏంటని మంత్రి ప్రశ్నించారు. దానికి అధికారి స్పందిస్తూ ప్రజాపాలన లో దరఖాస్థుల్లో సమస్యలు కారణంగా ఆలస్యం అవుతోందని చెప్పారు.

వైద్యాధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలి: మేఘా రెడ్డి
ఆస్పత్రులకు అత్యవసర సేవల కోసం వచ్చే బాధితులకు రిఫర్ చేసే సంస్కృతికి వైద్యాధికారులు స్వస్తి పలకాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. అత్యవసరంగా ఆస్పత్రులకు వచ్చే వారికి వేగంగా చికిత్స అందించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల విషయంలో సిబ్బంది ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడానికి వీళ్లేదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి, శిశు మరణాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అంతేకాకుండా వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రల్లో ఉన్న విలువైన చికిత్స పరికరాలను సక్రమంగా నిర్వహణ చేసుకోవాలని, నిరూపయోగంగా ఉన్న వాటిని ఉపయోగంలోకి తేవాలని చెప్పారు.

నీటి పారుదల
జిల్లాలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి అధికారులు తమకు ఉన్న పూర్తి అధికారాలను ఉపయోగించుకోవాలని మంత్రి చెప్పారు. కాలువల్లో జమ్ము ఉండడానికి వీళ్లేదని, వెంటనే డీ సెల్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 70 మినీ లిఫ్ట్ లలో మోటార్లు పని చేయడం లేదని దృష్టికి వచ్చిందని వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులతో శాఖల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

 సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్, మునిసిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, ఎంపిపి కిచ్చారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు

TEJA NEWS