TEJA NEWS

ఓం నమో వెంకటేశాయ నమః

తిరుపతి వెంకన్న సేవలో ఎమ్మెల్యే “శంకరుడు”

ఏడుకొండలస్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే “వీర్లపల్లి శంకర్”

మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అభిమానులు

కలియుగ దైవం ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన అభిమానులు తరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకున్నారు. గురువారం తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో వీర్లపల్లి శంకర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు అభిమానులు రాయికల్ శ్రీనివాస్, తుపాకుల శేఖర్, కావలి కృష్ణ, పసుల బుచ్చయ్య, లింగారెడ్డి గూడ అశోక్, అంబటి అంజి యాదవ్, కింది భాయ్ రవికుమార్, దేవగిరి నవీన్, బుడ్డ నరసింహ, నెహ్రు నాయక్, మంకాల శ్రీశైలం,ఆగిరి శేఖర్, నందిగామ శేఖర్, రాణా ప్రతాప్,రాజు, కిట్టు, శ్రీశైలం, సందీప్, మహేష్ ,వంశీ, పి ఎ శ్రీనివాస్, బుచ్చయ్య ,శీను, తదితరులు ఎమ్మెల్యే వెంట ఏడుకొండల స్వామి దర్శనాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే ప్రోటోకాల్ దర్శనంతో పాటు ఆయనను వెంకన్న సన్నిధిలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ దర్శనం అనంతరం మాట్లాడుతూ.. ఏడుకొండలస్వామిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలు అభిమానులతో కలిసి వెంకన్న స్వామి మొక్కుబడి ఉన్నందుకు వారి వెంట వచ్చి స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు..


TEJA NEWS