TEJA NEWS

అమ్మవారి జయంతి సందర్భంగా పసుపుతో కోటి గౌరమ్మ లు ఏర్పాటు,
శోభాయాత్ర
వనపర్తి
వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ మహిళా సంఘం ఆధ్వర్యంలో పసుపుతో కోటి గౌరమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కనకా పరమేశ్వరి దేవాలయం నుండి అమ్మవారి శోభాయాత్ర ప్రారంభమై పురవీదుల నుండి కోలాటాలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర ను పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాసవి సేవాసమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించి నందుకు మహిళలను అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగ బంది యాదగిరి మారం బాలేశ్వరయ్య ఆకుతోట దేవరాజు తాజా శివకుమార్ లెగిసెట్టి అశోక్ వెంకటయ్య పూరి పాండు బచ్చు రాము అమూర్తయ్య చిన్ని సురేష్ సి శ్రీనివాసులు మహిళా సంఘం తదితరులు పాల్గొన్నారు.