TEJA NEWS

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం

తిరుపతి జిల్లా:
తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాఫ్టర్లు చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ మొబైల్ లో రికార్డు చేశారు.

మరికొందరు భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యా దు చేశారు. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరాతీస్తు న్నారు. తిరుమల కొండపై ఉదయం హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతోంది.

శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల కొండపై హెలికాప్టర్ ఎలా వెళ్లిందనే విషయమై అధికారులు ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల కొండపై నుంచిహెలికాప్టర్ వెళ్లకూడదు.

తిరుమల శ్రీవారి కొండ పైన సంచరించింది ఎవరన్నది తెలియవలసింది..


TEJA NEWS