TEJA NEWS

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్

శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం అందించారు.
ఎన్నో రోజులుగా ఈ విషయంలో ప్రభుత్వం వెతక వైఖరిని ఆలంబిస్తుందని ఇలాగే కొనసాగితే హిందూ ఆగ్రహానికి గురికాక తప్పదని పటేల్ ప్రసాద్ హెచ్చరించారు ప్రజలకు కష్టం వస్తే దేవుడి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటారని కానీ ఇప్పుడు దేవుడికే కష్టం వచ్చింది కాబట్టి స్వయంగా ఆ దేవుడి చేతనే వినతిపత్రం ఇప్పించామని ఇకనైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర విడి కళ్ళు తెరవాలని కోరారు.

కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన మరియు మహిమాన్వితమైన స్వయంభు లింగక్షేత్రము శ్రీ శ్రంబులింగేశ్వర స్వామి దేవాలయం శంభునిగుడిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయము ఎన్నో సంవత్సరాలుగా అన్యమతస్తుల యొక్క ఆగడాల మధ్యన భక్తుల యొక్క రాకపోకలకు నోచుకోకుండా పోతుంది.

హిందువులు అతి పవిత్రంగా భావించే దేవాలయ ప్రాంగణం చుట్టూ అన్యమతస్తులు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేశారు.

దేవాలయ ప్రహరీని అనుకుని ఏర్పాటు చేసిన ఈ దుకాణాలు అక్రమమైనవే కాకుండా ఈ దుకాణాలు రోడ్డును ఆక్రమించి కూడా ఉన్నాయనేది వాస్తవం.

ఈ విషయమై హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా నిరంతర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి గతంలో పోలీసు శాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న దుకాణాలను వెంటనే తీయిస్తామని పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమ మాటను నిలబెట్టుకోలేదు.

మా నిరంతర పోరాటాల కారణంగా అక్కడ ఉన్న చెప్పుల దుకాణాలను మాత్రం తొలగించి మిగతా వాటిని అలాగే వదిలేశారు ఈ విషయం చాలా సున్నితమైనది హిందువుల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు వెంటనే శంభుని గుడిని సందర్శించి ఆలయ ప్రహరీని ఆనుకొని ఏర్పాటుచేసిన దుకాణాలన్నింటినీ వెనువెంటనే తొలగించి దేవాలయ పవిత్రతను కాపాడటం కోసం తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

అంతేకాకుండా మరొక పురాతన దేవాలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం యొక్క ఆస్తులు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి గుడికి సంబంధించిన దేవాలయంలో అక్రమంగా ఇళ్లను నిర్మించి నివసిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి దేవాలయ స్థలాన్ని తిరిగి దేవాలయానికి అప్పగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల పూర్తి విశ్వాసంతో చేస్తున్న ఈ వినతిని వెంటనే పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నది లేనియెడల హిందూ సమాజం పెద్ద సంఖ్యలో దేవాలయాల్ని దేవుడి ఆస్తుల్ని కాపాడటం కోసం రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి స్థితి రాకుండా దేవాలయ ఆస్తులను దేవాలయ పవిత్రతను కాపాడే బాధ్యతను తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ రెండు దేవాలయాల అక్రమణాలను వెంటనే తొలగించి దేవుడికి న్యాయం చేయాలని అలాగే హిందూ సమాజానికి అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నట్టు దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో బంటు రామరాజు, ప్రతాప్, మురారి ,బంటు ప్రవీణ్ ,యోగేష్ ,రాహుల్ ,మనీ ,రవి శ్రీకాంత్, చైతన్య ,తదితరులు పాల్గొన్నారు

ఇట్లు
దేవాలయ పరిరక్షణ సమితి, ఇందూరు


TEJA NEWS