
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
సూర్యపేట జిల్లా : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రంలో నూతన పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంఘం దోమ మండల అధ్యక్షులు చుక్కయ్య ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరాజు అధ్యక్షతన నిర్వహించిన దోమ ఎంపీడీవో కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛను 6000 పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాల్లో తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా గద్దనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన 14 నెలల పాలనలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తున్న తీరు దురదృష్టకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేచ్చేందుకు ముందుకు రావాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతోపాటు రాష్ట్రంలో చాలీచాలని పింఛన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగుల పెన్షన్ తక్షణమే 6000 కు పెంచడంతోపాటు రాష్ట్రంలో నూతన పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బీడీ కార్మికులకు గీతా కార్మికులకు వెంటనే నూతన పింఛన్లు విడుదల చేయాలని రాష్ట్రంలో వికలాంగుల అందరికీ వెంటనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంఘం దోమ మండల అధ్యక్షులు చుక్కయ్య అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడి కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ సంఘం పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య సంఘం దోమ మండలం మీడియా కన్వీనర్ టంకరి మహేష్ సంఘం దోమ మండలం ప్రధాన కార్యదర్శి బోయిని వెంకటయ్య పరిగి మండల ఉపాధ్యక్షులు నారాయణ కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు
