TEJA NEWS

రోజుకో పోలింగ్ సర్వే ? ఏది నిజం ? సర్వేలు తో అయోమయంలో పార్టీల శ్రేణులు?ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? వైసీపీ, టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లంటే ? చాణక్య స్ట్రాటజీస్ సర్వే !

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు తప్పదని తేలిపోయింది.

ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు?, ఎవరు ఓడిపోతున్నారు ? జిల్లాల్లో పరిస్ధితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్ధ తాజాగా సర్వే రిపోర్టు వెల్లడించింది.

దీని ఫలితాలు ఏపీలో టీడీపీ-జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి.

రాష్ట్రంలోని 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాల్ని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ-జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలిపింది.

సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో పది సీట్లకు టీడీపీ-జనసేన కూటమికి 8, వైసీపీకి 2 సీట్లు రానున్నాయి. విజయనగరంలోని 9 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 4, వైసీపీకి 4 సీట్లు వస్తుండగా.. ఓ సీటులో హోరాహోరీ పోరు ఉంది. విశాఖపట్నం జిల్లాలోని 15 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 11 సీట్లు, వైసీపీకి 2 సీట్లు వస్తున్నాయి. మరో 2 సీట్లో హోరాహోరీ ఉంటుందని తేల్చింది. తూర్పుగోదావరిలో 19 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 16 సీట్లు వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో హోరాహోరీ ఉంటుందని తెలిపింది. పశ్చిమగోదావరిలో 15 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 12, వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో గట్టిపోటీ ఉండబోతోంది.

కృష్ణాజిల్లాలో 16 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో రెండు సీట్లలో గట్టిపోటీ ఉంటోంది. గుంటూరు జిల్లాలో 17 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టిపోటీ ఉంది. ప్రకాశం జిల్లాలోని 12 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 8, వైసీపీకి 3, ఓ సీటులో హోరాహోరీ పోరు ఉండబోతోంది. నెల్లూరు జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 6, వైసీపీకి 3, ఓ సీటులో గట్టి పోటీ ఉండబోతోంది. కడప జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 4, వైసీపీకి 4, మరో రెండు సీట్లలో హోరాహోరీ ఉంటుంది.

కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 5, వైసీపీకి 7, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉండబోతోంది. అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 10, వైసీపీకి 3 సీట్లు లభిస్తున్నాయి. మరో సీటులో గట్టిపోటీ ఉంది. చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 7, వైసీపీకి 5, మరో రెండు సీట్లలో హోరాహోరీ పోరు నెలకొంది. పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి 43, వైసీపీకి 41, జనసేనకు 10, ఇతరులకు 6 శాతం లభిస్తున్నాయి.

రాష్ట్రంలో ఈసారి ఎన్నికల అంశాలుగా మారబోతున్న వాటిలో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, వైసీపీ నవరత్నాల ప్రభావం, రాష్ట్రంలో అభివృద్ధి లేమి, గత ప్రభుత్వాలకూ-వైసీపీ ప్రభుత్వానికీ మధ్య తేడా, చంద్రబాబు అరెస్టు, వైఎస్సార్-జగన్ ప్రభుత్వాల మధ్య తేడా, కులసమీకరణాలు, టీడీపీ-జనసేన కూటమి ఏర్పాటు, గ్రామాల్లో నేతలపై పార్టీల ప్రభావం, ధరాఘాతం, ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు ఉన్నాయి.


TEJA NEWS