TEJA NEWS

Pawan Kalyan : లడ్డు బాధ్యులపై చర్యలు పక్కా.. డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్

తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేవాలయాలకు సంబంధించిన పలు అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ధార్మిక పద్ధతులు, అన్ని సమస్యలు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలన్నారు


TEJA NEWS