
ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్
AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
