TEJA NEWS

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ స్టేట్ చైర్మన్ మారం జగదీశ్వర్

సూర్యపేట జిల్లా : ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు నెలల్లో పెండింగ్ బిల్లులను విడుదల చేస్తాం అని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని తెలంగాణ జేఏసీ ఆల్ ఎంప్లాయ్ స్టేట్ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సెవెన్ స్టార్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులను, వచ్చే డిఎల్, పిఆర్సి కమిటీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రద్దు చేస్తామని అన్నారని, ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్న ఇంతవరకు పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వేరే రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. 7.5 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పినప్పుడు మేము 15 నెలలు వేచి చూసి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామని అన్నారు.ఇప్పుడు 8 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. మళ్లీ ప్రతినెల 500 కోట్ల బిల్లు పెండింగ్లో ఉంటాయని ఇలా పోతూ పోతూ ఉంటే ప్రభుత్వం పెండింగ్ బిల్లులను ఎక్కువై చెల్లించలేని పరిస్థితిలో ఉంటుందని తెలిపారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మీరు ఉచితాలు ఇవ్వండి మాకు సంబంధం లేదు మా పెండింగ్లో ఉన్న బిల్లులను పి ఆర్ సి ఇచ్చిన తర్వాత మా బిల్లులు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.

మా ఉద్యోగులకు లక్షల లక్షలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. హెల్త్ కార్డుల గురించి కూడా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడంలేదని తెలిపారు.భారతదేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో మేము ఉంచుతామని మా బాధ్యతను మీరు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్ రెడ్డి, ఇంజనీర్ జేఏసీ చైర్మన్ పాండు నాయక్,డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జేసి జాయింట్ సెక్రెటరీ డి స్వప్న, సిటీవో డిపార్ట్మెంట్ చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం సైదులు, బి వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.