TEJA NEWS

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్

పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ భాషా మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థను చిన్న భిన్న చేసిన జీవో నెంబర్.117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిలాని మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా నియామకం జరగకపోవడం దారుణమని, వెంటనే ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిపిడి. సోషలిజం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సిపిఎస్ రద్దు చేస్తానన్న ప్రభుత్వ హామీని నిలుపుకోలేకపోవడం శోచనీయమని ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు వై. నేతాంజనేయ ప్రసాద్, ఐ. విజయ్ సారథి, జిల్లా శాఖ పూర్వ అధ్యక్షులు ఎం సి హెచ్. రాజరత్నం, మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్స్, రాష్ట్ర కౌన్సిలర్స్ పాల్గొన్నారు


TEJA NEWS