TEJA NEWS

పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ .

  • – – సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయడం లేదా NCRP పోర్టల్ https://cybercrime.gov.in/ లో పిర్యాదు చేయండి.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులమని అగంతుకుల ఏదో ఒక నెంబర్‌ నుంచి ఫోన్‌ చేయడం, మీరు లేక మీ కుటుంబ సభ్యులు ఏదో కేసులో ఇరుక్కున్నారని బెదిరించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం, లేక సైబర్‌ నేరాలకు పాల్పడేందుకు వ్యక్తిగత వివరాలు అడగడం, లేదంటే నెంబర్‌ బ్లాక్‌ అవుతుందని దబాయించడం వంటి కేసులు పెరిగిపోయాయిని ఈలాంటి ఫోన్ కాల్స్ కు, గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలు, ఫోన్ లకు వచ్చే మెసేజ్ లకు, లింక్ లకు స్పందించవద్దని ఎస్పీ గారు సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దన్నారు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

మీకు లాటరి, లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయడం లేదా NCRP పోర్టల్ https://cybercrime.gov.in/ లో ఫిర్యాదు చెయ్యండి.

చైన్ మార్కెటింగ్(గొలుసుకట్టు) మోసాలు ,ఏదైనా కంపెనీ పేరుతో ముందుగా మీరు కొంత డబ్బు కట్టి జాయిన్ అవ్వండి ఆ తరువాత అందులో మరో ముగ్గురిని జాయిన్ చేయిస్తే మీకు లైఫ్ లాంగ్ income ఉంటుంది అని చెప్పి మోసం చేస్తారు.

అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

“ఇంస్టాగ్రామ్” లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.

సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు

మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.


TEJA NEWS