TEJA NEWS

ప్రజలు కేసీఆర్ తో విసిగిపోయి… కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పట్టం కట్టి గెలిపించారు.
గెలిపించిన ఖర్మానికి గత రెండు నెలలుగా చెరువుల పక్కన, మూసీ నది పక్కన 30-40 ఏళ్లుగా రెక్కల కష్టం మీద సంపాదించిన డబ్బుతో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

మూసిలో కొబ్బరినీరు పారిస్తా అన్న.. ఇవాళ డి పి ఆర్ లేదని, ఇంకా ప్రణాళిక రూపొందించలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం నివసిస్తున్న ప్రజలకు మాత్రం కంటిమీద కునుకు లేదు.
పోయి మీద పెనం పెట్టే పరిస్థితి లేదు.

శనివారం ఆదివారం వస్తే భయభ్రాంతులకు గురయ్య పరిస్థితి ఉంది. ఇక్కడున్న ప్రజానికం మా శవాల మీద రేవంత్ రెడ్డి గారిని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్ లాంటి సుందరమైన భవనాలు కట్టుకోమను మాకు బాధ లేదు కానీ మా గొంతులో ప్రాణం ఉండగా మమ్మల్ని ఈ జాగా నుండి వేరు చేస్తామంటే మీ జేజమ్మ వచ్చినా కాదని చెప్తా ఉన్నారు.

నోరు విప్పితే రేవంత్ రెడ్డి అబద్దాలు తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడతలేరు. ఈ ప్రాంత ప్రజలు వారంతటికి వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన, మీలాంటి చానల్స్ వచ్చి మాట్లాడించిన కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, సామాన్య ప్రజల మీద రాజ్యం యొక్క హింస, దౌర్జన్యం ప్రయోగిస్తున్నారు… మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతున్నారు తప్ప రాజ్యంతో వాళ్ల కొట్లాడే శక్తి లేదు.

భారతీయ జనతా పార్టీగా కచ్చితంగా ఈ పేదలకు అండగా ఉంటాం. ఈ పేదల ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని హెచ్చరించడానికే మేము మూసీ పరివాహ ప్రాంతాల్లో రెండు నెలలుగా తిరుగుతున్నాము.

పార్టీ పరంగా ఇవాళ రేపు ఈ ప్రాంతాలలో సందర్శించి ప్రజల యొక్క మనోభావాలను, అంతరంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రతిబింబించే పద్ధతి లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాము.

ఈ ప్రాంత ప్రజానికమంతా బిడ్డ మా కోసం మీరు ధర్నా చేస్తున్నారు 100% వస్తాం రేవంత్ రెడ్డి సంగతి ఏంటో తేలుస్తామని చెప్తున్నారు.

పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దు, వాళ్ళ బ్రతుకులలో మట్టి కొట్టొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.


TEJA NEWS