శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తక్షణం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ రాశారు. గత 18 నెలలుగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దిగజారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మరోవైపు, మణిపూర్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేలు 27 మంది ఆ రాష్ట్రంలోని జిరిబమ్ జిల్లాలో మహిళలు, పిల్లల హత్యలకు కారకులైన కుకి మిలిటెంట్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ జరపాలని తీర్మానించారు. మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఆ రాష్ట్ర సీఎం బీరేన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకొంటే తప్ప పరిస్థితులు చక్కబడవని తెలిపారు. కాగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ అమలుచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇంపాల్ పశ్చిమ జిల్లాలో పలు పౌర సంఘాలు మంగళవారం కర్ఫ్యూని ఉల్లంఘించి ర్యాలీని నిర్వహించాయి.
శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు
Related Posts
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
TEJA NEWS మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ హైదరాబాద్: ఉదయం 7 గంటల నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతు న్నాయి. నవంబర్ 23 శనివారం న ఓట్ల…
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట
TEJA NEWS ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆయనపై విచారణకు గతంలో, ట్రయల్ కోర్టు అనుమతి తాజాగా, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర మాజీ మంత్రి,…