TEJA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 92 లో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్న కరుణాకర్ కుమార్తె ఉషారాణి కి మల్లారెడ్డి కాలేజ్ లో ఎం.బి.ఎ సీట్ వచ్చింది కానీ తల్లితండ్రులు కాలేజ్ బస్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకులు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వారికి సమస్యను వివరించి తగిన సాయం చేయాలని కోరగా, హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వారు విద్యార్థినికి కాలేజ్ బస్ ఫిజు నిమిత్తం నలభై వేల రూపాయల చెక్ ను వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థినికి అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేద విద్యార్థిని చదువుకు ఇబ్బంది రాకుండా ఆర్థిక సహాయం చేసిన హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్య కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. హోప్ ఆ హాంగర్ సంస్థ వారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండలనే ఉదేశ్యం తో వారి కుమార్తె చదువుకు ఎటువంటి ఆటంకం కల్గకూడదనే ఉద్దేశ్యంతో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వారు చెల్లించడం జరిగినది అని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాలలో వెలుగులు నింపడానికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. పై  చదువలకు ఆటంకం కల్గకుండా , మంచి గా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాందించుకోవాలి అని , ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని ఉన్నత లో స్థిరపడలని ఎమ్మెల్యే గాంధీ విద్యార్థి ఉషారాణి ని ఆశీర్వదించడం జరిగినది .ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని విద్యార్థికి చెప్పడం జరిగినది . దీనికి విద్యార్థి మరియు కుటుంబ సభ్యులు స్పందిస్తూ  కళాశాల బస్సు ఫీజు కొరకు  ఆర్థిక సహాయాన్ని అందించిన హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వారికి, ఎమ్మెల్యే కు, కార్పొరేటర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పడం జరిగినది ,మంచిగా చదువుకొని ,పది మందికి ఉపయోగపడేలా ఉంటానని ,నా పై చదువులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన వారిని జీవితం లో ఎప్పటికి మర్చిపోలేనని విద్యార్థిని చెప్పడం జరిగినది .

కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, వాలి నాగేశ్వరరావు, మోజెస్,తిరుపతి, హోప్ ఆఫ్ హాంగర్ సభ్యులు వెంకటేశ్వరావు మరియు రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.