TEJA NEWS

జర్నలిస్ట్ లపై పోలీసుల అత్యుత్సాహం హేయమైన చర్య

  • టీజేయు కమలాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పెర్క రమాకాంత్
    కమలాపూర్ :
    ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టుల పై దాడి చేసిన ఘటనను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ( టీజేయు ) కమలాపూర్ మండల అధ్యక్షులు పెర్క రమాకాంత్ తీవ్రంగా ఖండించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక టీజేయు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో రమాకాంత్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న నిరుద్యోగుల నిరసన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు లాఠీలతో దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజా పాలన అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడి జరగడం ఏంటని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై విచారణ జరిపించి రిపోర్టర్ శ్రీ చరణ్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలకు స్పృహ కోల్పోయి పడిపోయిన శ్రీ చరణ్ ని పోలీసులు రోడ్డుపై పడేసి వెళ్లిన తీరును ఆయన తప్పు పట్టారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో పాత్రికేయులు టీజేయు మండల ప్రధాన కార్యదర్శి పెండెం రాజేంద్రప్రసాద్,ఉపాధ్యక్షులు ఎడ్ల నాగరాజు, సహాయ కార్యదర్శి జూపాక విక్రం, కార్యవర్గ సభ్యులు ఎం డి సందాని, పుల్ల సందీప్, ఎర్రం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

TEJA NEWS