TEJA NEWS

నాగర్ కర్నూలు జిల్లా లో 22 న పూలే అంబేడ్కర్ జాతర

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తేదీ 22వ తారీఖున జరగబోయేటువంటి పూలే అంబేద్కర్ జాతర కార్యక్రమానికి రాష్ట్ర కళాకారులు డాక్టర్ ఏపూరి సోమన్న గిద్దె రామ నరసయ్య మచ్చ దేవేందర్ ప్రొఫెసర్ ఖాసీం సార్ ఉన్నారు జిల్లాలో ఉండే ప్రతి కళాకారుడు ఆ మహనీయుల త్యాగాలను కీర్తిస్తూ ప్రతి కళాకారుడు తన ఆటపాట మాటతో వారి త్యాగాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివిధ కళారూపాలతో వివరించాలని ప్రతి కళాకారుడు హాజరుకావాలని పూల అంబేత్కర్ జాతర సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు డప్పు లక్ష్మణ్ కోరడం జరిగింది దీనికి సంబంధించిన కళాకారుల పోస్టర్ కల్వకుర్తి నియోజకవర్గం లో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీకే గౌడ్ సహాయ కార్యదర్శి కోడిపత్రి విజయ్ కాంత్ ,ప్రచార కార్యదర్శులు గుమ్మకొండ రమేష్ చిన్నపాగ శివయ్య గౌరవ సలహాదారులు బొజ్జన్న,సింగర్ జీవిత ఉపాధ్యక్షులు సుకుమార్, మరియు సింగం విజయ్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.