
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ – ఏపీ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం – 26 మార్చి 2025
ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య తెలిపారు. కాకానీ నగర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు వినతులు అందజేశారు. తాగునీటి సమస్యలు, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు. ఈ సందఠంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా గత వైసిపి పాలనలో పరిష్కారం కానీ ఎన్నో రెవెన్యూ సమస్యలతో ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ప్రజా దర్బార్ నందు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధికారులు పాల్గొన్నారు.
