TEJA NEWS

దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ

-సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర
శ్రీకాంత్…

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి మనిషి పై లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరి తలపై అప్పు వేస్తున్నారని ఆరోపించారు. బుధవారం సుందరయ్య భవన్ లో జరిగిన పార్టీ ఖమ్మం అర్బన్ రాజకీయ శిక్షణా తరగతులను శ్రీకాంత్ ప్రారంభం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోవైపు తీవ్రమైన అధిక ధరలు ప్రతి వస్తువుపై జిఎస్టి వేస్తూ రెండు రకాల దోపిడీని ప్రజల నుండి గుంజుకుంటున్నారని. ధరల పెరుగుదల కారణంగా ప్రజల జీవన విధానం క్షీణిస్తుందని 60 శాతం మంది ప్రజలకు పౌష్టికాహార లోపంతో ఉన్నారని 80 శాతం మంది ప్రజలకు వైద్య సౌకర్యాలు అందటం లేదని మరోవైపు కార్పొరేట్ గుత్తా పెట్టుబడుదారుల శక్తుల అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెడుతున్నారని దేశ సంపదను కారుచౌకగా కట్టబెడుతున్నారని 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారని మరోవైపు 12 లక్షల కోట్ల రూపాయలను పన్ను రాయితీ ఇచ్చి రద్దు చేశారని ఆరోపించారు ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు మరింతగా చేయవలసిన అవసరం వుంది అని తెలిపారు.గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు . దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే పనిలో మోడీ ప్రభుత్వం వుంది అని, రాబోయే కాలంలో మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ ఆందోళనల పార్టీ శ్రేణులను భాగస్వాములుగా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, నాయకులు ఏస్ కే మీరా సాహెబ్ బత్తిని ఉపేంద్ర మండల కార్యదర్శి అర్బన్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS