TEJA NEWS

103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని!

న్యూ ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం తర్వాత వాటిని తిరిగి ప్రారంభించనున్నారు. వర్చువల్గా జరగనున్న కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దన రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు ప్రధాని. వీటిలో తెలంగాణ నుంచి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నీ అమృత భారత్ స్టేషన్ యోజనలో భాగంగా రీడిజైన్ చేసి, అత్యాధునికంగా తీర్చిదిద్దారు.