రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్ చేసింది.
ఏపీలో మోదీ సభలు, రోడ్ షోలకు భారీగా ప్లాన్ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు.
ఏపీపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది.
కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.
8వ తేదీన రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు.