TEJA NEWS

పాదయాత్రలో పాల్గొన్న యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్.

● పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కో-కోఆర్డినేటర్ మరియు 111వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి బీరంగూడ నుండి రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిరి ప్రిథ్వీరాజ్ హరీష్ అన్న తో కలిసి గణేష్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని, అందుకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే శ్రమించాలనీ దిశా నిర్దేశించారు. పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి , సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ , మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ , కార్పొరేటర్ మెట్టు కుమార్ , మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి , లలిత సొమ్మారెడ్డి గారు, జిన్నారం వెంకటేష్ గౌడ్ , గోవర్ధన్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.