జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన పిరికిపంద దాడికి నిరసన
సీనియర్ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే, అడ్వకేట్ అసీమ్ సరోదే, విశ్వంబర్ చౌదరిపై గురువారం పుణెలో బీజేపీ గూండాలు దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడి ముమ్మాటికి రాజ్యాంగవాద జర్నలిస్టుపై దాడి, భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా వక్తలు పేర్కొన్నారు. ఈ నిరసన అంబేడ్కరైట్ సామాజిక సంస్థఐన “బాన్ దిల్కి” తరపున సోమవారం తూర్పు దాదర్ స్టేషన్ బైట నిరసనలు జర్పారు. ఈ సందర్భంగా సమయంలో దాడికి పాల్పడిన వారిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని, రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని హాజరైన వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో దాడి చేసిన వారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ ఉద్యమంలో సీనియర్ మరాఠా నాయకుడు దివాకర్ దల్వీ, బాంధిల్కి సామాజిక సంస్థ ప్రముఖులైన ప్రమోద్ సావంత్, కమలాకర్ షిండే, రూపేష్ పురల్‌కర్, నాగేశ్ పెడ్నేకర్, ప్రదీప్ షిండే, సిద్దార్థ్ సాల్వే, మనోహర్ సక్‌పాల్, అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందకిషోర్ తలశిలకర్, విజయ్ పరబ్, జర్నలిస్ట్ మూల్ నివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.