
ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించండి: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్
వనపర్తి జిల్లా
అమరచింత మండలంలోని పామిరెడ్డి పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన పామి రెడ్డి పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో కిటికీలకు తలుపులకు మరమ్మతులు చేయాలని టాయిలెట్లను మరమ్మతులు చేయాలని ప్రభుత్వ అధికారులనుడిమాండ్ చేశారు. వచ్చేనెల లో పాఠశాలలు పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ప్రభుత్వం స్పందించి ఈ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలు ప్రారంభం ముందే విద్యార్థులకు పుస్తకాలు అందించాలని ఏక రూపదుస్తులు అందించాలని కోరారు. లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు శివ మైబు ముజీఫ్ పాల్గొన్నారు.
