TEJA NEWS

నేలకూలిన వృక్షాలు, విరిగిన విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించండి- తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష.

తిరుపతి నగరం లో ఆదివారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు ను త్వరగా తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఇంజనీరింగ్ అధికారులను, విద్యుత్ అధికారులను ఆదేశించారు.

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులు తో కలిసి 11,27 వ డివిజన్ పరిధిలోని చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, తాతనగరు లో సోమవారం ఉదయం దగ్గరుండి పర్యవేక్షించారు. నేలాకూలిన బారి వృక్షాలు , విద్యుత్ స్తంభాలు ను త్వరగా తొలగించాలని, డ్రైనేజ్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృక్షాలు , మొక్కలు విద్యుత్ స్తంభాలు కారు, ఆటోలు , షాపులు ధ్వంసమైన వాటిని పరిశీలించారు. వీఆర్వో మాట్లాడి షాపులు వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆదివారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది, అకస్మిక వడగండ్లు ఈదురు గాలులతో కూడిన వర్షంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు సకాలంలో నగరపాలక అధికారులు, విద్యుత్ అధికారులు వెంటనే వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు కూడా రెండు, మూడు రోజుల్లో గాలివాన ఉన్నాయని అప్రవతంలో ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డి.ఈ. రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, తులసి యాదవ్, భాష, కృష్ణ, విద్యుత్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.