TEJA NEWS

రామగుండం: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సీపీ

రామగుండం: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రెండు జిల్లాల్లో 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేలా అందరూ సహకరించాలని సీపీ కోరారు