TEJA NEWS

టేక్మాల్ పోలింగ్ బూతులను పరిశీలించిన ఆర్డీవో రమాదేవి

టేక్మాల్

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ . 431 గ్రాడ్యుయేట్స్
బూత్ నెంబర్ -225 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా అధికారి ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ తులసి రామ్, ఆర్ ఐ సాయి. శ్రీకాంత్ ల ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్నికల రోజు తీసుకోవాల్సిన పలు అంశాలపై వారికీ తగు సూచనలు చేశారు. వారితో మండల అధికారులు పాల్గొన్నారు.