TEJA NEWS

ఏడడుగుల కండక్టర్ అన్సారీ
కష్టాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి

ఆర్టీసీలోనే వేరే విభాగానికి బదిలీ చేయాలని ఆదేశాలు

సోషల్ మీడియా బలం అంటే ఇదే! రెండు రోజుల క్రితం కండక్టర్ అహ్మద్ అన్సారీ కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది! ఆయన హైట్ చూస్తే దాదాపు ఏడడుగులు! చేసే ఉద్యోగం చూస్తే ఆర్టీసీ లో బస్సు కండక్టర్! మన ఆర్టీసీ బస్సుల టాప్ చూస్తే 6.4 అంగుళాలు! దాంతో ఆయన హైట్ తో ఇబ్బందులు పడుతూ తల ఒక వైపుకు వంచి విధులు నిర్వహిస్తున్నారు!

రోజూ ఆ బస్సులో ప్రయాణించే దివ్య అనే ఉద్యోగి ఆయన కష్టం చూసి పాపం చలించిపోయి వీడియో తీసి రీల్స్ లో వదిలింది! ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది! చూసిన వాళ్ళు షేర్ చేశారు! కొన్ని పత్రికలు వెబ్ సైట్స్ లో ప్రచురించాయి. మొత్తానికి అన్సారీ కష్టం వైరల్ అయ్యింది!

జనం దృష్టిలో పడి అయ్యో పాపం అనుకున్నారు! మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది! రేవంత్ రెడ్డి స్పందించారు. మెడ వంచి ఎన్నాళ్ళు కష్టం పడతారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు. ఆయన ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో మాట్లాడారు. అన్సారీ ని ఆర్టీసీ లో వేరే విభాగానికి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. హెడ్ ఆఫీస్ కు లేదా ఎంజిబిఎస్ బస్టాండ్ కు మార్చాలని నిర్ణయించారు.

అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్ చాంద్రయణ గుట్ట దగ్గరలో వున్న షాహీ నగర్ లో నివాసం వుంటున్నారు. అన్సారీ తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ అనారోగ్యంతో 2021లో చనిపోయారు! కుమారుడు అన్సారీ ఇంటర్ మాత్రమే చదివి ఉండటం తో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఆర్టీసీ లో కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది. మెహదిపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్ ఉద్యోగం! ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం అతనికి సవాలుగా మారింది!

సహజంగా ఆర్టీసీ టాప్ ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది! అంటే 195 సెంటి మీటర్లు! అన్సారీ ఎత్తు 214 సెంటి మీటర్లు! విధుల్లో భాగంగా గంటల తరబడి తల వంచి ప్రయాణించడం అనేక కష్టాలు అనారోగ్య సమస్యలు తెచ్చి పెట్టింది! మెడ నొప్పితో పాటు వెన్ను నొప్పి, నిద్ర లేమితో ఇబ్బందులు పడుతున్నానని, వీక్లీ ఆఫ్ రోజు ఆసుపత్రికే పరిమితం అని అన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు. అతని రూట్ లో రోజు ప్రయాణించే వారు కూడా అన్సారీ కి ఆర్టీసీ లోనే మరేదైనా ఉద్యోగం ఇవ్వాలని ఇప్పటికే చాలామంది మెయిల్స్ చేశారు! మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది! డైనమిక్ సిఎం స్పందించారు! వెంటనే అతనికి వేరే విభాగానికి బదిలీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు.