
సీబీఎస్సీ పదవ తరగతి ఫలితాల్లో రేవతి హై స్కూల్ విజయభేరి
శంకర్పల్లి: తెలంగాణ సీబీఎస్సీ పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ విద్యార్థులు విజయడంకా మోగించారు. పట్టణ పరిధిలోని 15 వ వార్డు సాయి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గండేటి వెంకటేష్ గౌడ్ కుమారుడు తేజస్ చంద్ర గౌడ్ 500 మార్కులకు 484 మార్కులు సాధించాడు. అదే విధంగా సిహెచ్ హాసిని 461, జి పూజిత 451, వై అక్షయ 449, జె పూజిత 440 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, అకాడమిక్ డైరెక్టర్ పావని.. తేజ చంద్ర గౌడ్ విద్యార్థికి మేమెంటో అందజేసి, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
