TEJA NEWS

సూర్యాపేటలో దొంగల బీభత్సం

చేతివాటం తో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న దొంగలు

సూర్యాపేట జిల్లా : గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస దొంగతనలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దొంగల ముఠా ఎప్పుడు ఎవరిల్లు దోచుకుంటారో తెలియక జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి చివ్వేమ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం మరువకముందే రాత్రి సూర్యాపేట మునిసిపాలిటీ 14వ వార్డు స్నేహ నగర్ లోని కొమ్ము ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు 7 తులాల బంగారం, 5 తులాల వెండి, లక్ష రూపాయల నగదు దొంగిలించారు. ఇంటికి తాళం కనిపిస్తే చాలు గొంగలు వారి చేతివాటం చూపిస్తున్నారు.

ఊరెళ్ళిన ప్రభాకర్ కుటుంబం తిరిగి వచ్చి చూస్తే వారింట్లో దొంగలు పడ్డారని గ్రహించారు. చేసేది ఏమిలేక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేసుకున్నారు. గతంలో దొంగతనం చేసిన దొంగలకు ఇప్పుడు జరిగిన దొంగతనాలకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై సూర్యాపేట సీఐ సురేందర్ రెడ్డి బాధితులనుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


TEJA NEWS