Spread the love

నరసన్నపేట బీసీ హాస్టల్ అభివృద్ధికి రూ.9లక్షలు మంజూరు

శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, : నరసన్నపేట బీసీ హాస్టల్ అభివృద్ధికి రూ.9లక్షలు మంజూరు చేయడం జరిగిందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న బాలికల వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.9 లక్షల నిధులు మంజూరయ్యా యని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు.

ఈ సందర్బంగా సంబంధిత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంలో సాధ్యమన్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు చదువుపై దృష్టి సారించాలంటే వారికి మౌలిక సదుపాయాలు అందజేయాలని అందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఈ దిశగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ,కూటమి నాయకులు,కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు మరియు ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.