నైతికతకు కట్టుబడి పదవులనే త్యాగం చేసిన మహోన్నతుడు మాజీ ప్రధాని వాజ్ పేయి :ఎంపి కేశినేని శివనాథ్
సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్ లో వాజ్ పేయి కి నివాళి
ఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అధికారం కోసం ఏనాడు అవకాశవాద రాజకీయాలు చేయలేదని, రాజకీయ ప్రతికూల పరిస్థితిల్లో కూడా నైతికతకి కట్టుబడి పదవులనే త్యాగం చేసిన మహోన్నతుడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆయన సేవలను కొనియాడారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా బుధవారం ఎంపి కేశినేని శివనాథ్ సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ హౌస్) సెంట్రల్ హాల్ లో వాజ్ పేయి చిత్రపటానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళులర్పించారు. భారత దేశ రాజకీయాల్లో వాజ్ పేయి చెరిగిపోని ముద్ర వేశారన్నారు. ఎంతటి సంక్లిష్టమైన విషయాన్ని అయినా సరళ భాషలో చెప్పటం ఆయన శైలి అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకి వాజ్ పేయి ఆశయాలు, జీవితాచరణ స్పూర్తిదాయకమే కాదు ఆదర్శనీయమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.