
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చన
దేవరకద్ర పట్టణంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి భక్తులు అభిషేకాలు అలంకరణ వంటి కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. అమ్మవారి సన్నిధిలో అమ్మవారి నామాన్ని స్మరిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అర్చకులు పాల్గొన్నారు.
