TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 64 లక్షల రూపాయల తో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, కాలనీల వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, హైదర్ నగర్ డివిజన్ మరియు శేరిలింగంపల్లినియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు

1.సమత నగర్ కాలనీలో రూ.22.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు*

2.జలవాయ్ విహార్ కాలనీ లో రూ.27.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు

  1. భాగ్య నగర్ కాలనీ లో రూ.15.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు.

పైన పేర్కొన్న సీసీరోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS