TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జగిత్యాల కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు పట్ల ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

ముఖ్యమంత్రి (విద్యాశాఖ) రేవంత్ రెడ్డి ని గతంలో కలిసి జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజురుచేయాలని కోరగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయగా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.అదేవిధంగా కోరగానే జిల్లా కలెక్టర్ గారు,జిల్లా అధికారులు,రెవెన్యూ అధికారులు జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్ పల్లి మెయిన్ రోడ్డు పైన ఉన్న 25 ఎకరాల భూమి సర్వే చేసి కాంటూరు మ్యాప్ తో సహా మరియు చల్ గల్ వాలంతరి స్థలాన్ని సైతం విద్యాశాఖ కార్యదర్శి కి పంపించడం జరిగిందనీ రెండింటి లో ఒకచోట నిర్మించడానికి దాదాపు 100 కోట్ల పైన ఖర్చుపెట్టి నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డి కి జగిత్యాల నియోజకవర్గ,జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .అనంతరం జగిత్యాల నియోజకవర్గ పలు అభివృద్ధి పనుల పై ముఖ్యమంత్రి తో చర్చించారు.


TEJA NEWS