TEJA NEWS

పాక్‌కు ఇచ్చిపడేసిన సానియా మీర్జా.. ఇది కదా కావాల్సింది..

పహల్గాం అటాక్‌కు రివేంజ్ తీర్చుకుంది భారత్. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 టెర్రరిస్ట్ క్యాంపులపై సక్సెస్‌ఫుల్‌గా అటాక్స్ చేసింది. ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు చేసి జైషే మహ్మద్, లష్కరే తొయిబా లాంటి టెర్రర్ సంస్థలను చావుదెబ్బ తీసింది. భారత్ పేరు చెబితే గజగజ వణికేలా చేసింది. మెరుపు దాడులతో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు. దీంతో మోదీ ప్రభుత్వంతో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్‌పై నలువైపులా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా ఆపరేషన్ సిందూర్‌పై స్పందించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదీ భారత్ అంటే..

ఒక్క ఫొటోతో భారత్ తన మెసేజ్‌ ఏంటో గట్టిగా చాటిచెప్పిందని సానియా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఒక దేశంగా మనమేంటో అందరికీ సుస్పష్టం చేశామంటూ ఆపరేషన్ సిందూర్‌ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఫొటోను సానియా షేర్ చేసింది. ఇదీ భారత్ అంటే అని రాసుకొచ్చింది. కాగా, ఆపరేషన్ సిందూర్ గురించి భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు వివరించడం హైలైట్‌గా మారింది. గురిపెట్టి ఉగ్ర స్థావరాలపై జరిపిన క్లిష్టమైన ఆపరేషన్ గురించి సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ దేశ ప్రజలకు చక్కగా వివరించారు. ఇందులో సోఫియా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. వ్యోమిక సిక్కు వర్గానికి చెందిన వారు. వీళ్లతో పాటు అదే వేదిక మీద పాల్గొన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్ కావడం విశేషం. అందుకే పహల్గాంలో టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్చిచంపడాన్ని ఎత్తిచూపుతూ.. ఇండియాలో ఐక్యతను చాటిచెప్పేలా సానియా మీర్జా ఈ పోస్ట్ చేసిందని అర్థమవుతోంది.

ఒక్క పోస్ట్‌తో..

సానియా పోస్ట్ చూసిన నెటిజన్స్.. ఇది కదా కావాల్సింది అని అంటున్నారు. ఉగ్రవాదం పీచ అణచడంతో పాటు పాకిస్థాన్ ఆట కట్టించేందుకు భారత భద్రతా దళాలు చేస్తున్న పోరాటానికి సానియా అండగా నిలవడం అభినందనీయమని అంటున్నారు. సామాన్య ప్రజలతో పాటు సానియా లాంటి సెలెబ్రిటీల మద్దతు ప్రభుత్వానికి, సైనికులకు అవసరమని చెబుతున్నారు. అందరూ అండగా ఉంటే సర్కార్-సోల్జర్స్ తమ పని తాము చేసుకుపోతారని కామెంట్స్ చేస్తున్నారు. సానియా ఒక్క పోస్ట్‌తో పాక్‌కు ఇచ్చిపడేసిందని ప్రశంసిస్తున్నారు.