TEJA NEWS

పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి.
కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 25 వార్డులో గల కర్ణాల వీధి, అరవల్లి వీధి, వేశాలమ్మ గుడి వీధి, బలిజ వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వస్తున్న పారిశుద్ధ్య పనులు బాగా చేపట్టాలని అన్నారు. ప్రతి వీధిలో చెత్త వాహనం వచ్చేలా చూడాలని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ లో తిరుపతి ముందుస్థానంలో ఉండేలా ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ జరుగుతోందని అనరు తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని అన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహచారి, మునిసిపల్ ఇంజినీర్ తులసి , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ రాజు, ఏసిపి బాలాజీ, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.