చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సర్తాజ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు రెండోసారి పంపాలని ఓటర్లను కోరారు.