
రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల నాదేశించిన……… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి జిల్లా
రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పై సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలంలో ప్రజలు దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్ గునియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు వారంలో రెండు రోజులు డ్రై డే పాటించడం, ఫాగ్ మిషన్లు సిద్ధం చేసుకోవడం, జ్వరం సర్వే, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవడం వంటివి ముందస్తుగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన మిషన్ మధుమేహ పై సమీక్షిస్తూ జిల్లాలో గుర్తించిన 19, 643 మంది డయాబెటిస్ రోగులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్.బి. ఎ.1 సి రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దానితోపాటు వారికి అవసరమైన ఎల్.ఎఫ్.టి. సి.బి.పి. వంటి పరీక్షలు నిర్వహించి రోగి పూర్తి బయోడేటా ను గూగుల్ షీట్ లో నమోదు చేయాల్సిందిగా ప్రోగ్రాం ఆఫీసర్ డా. రామచంద్ర రావు ను ఆదేశించారు.
అదేవిధంగా మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించే విధంగా ఏ.ఎన్.యం, స్టాఫ్ నర్స్ లకు శిక్షణ ఇచ్చి జిల్లాలో 30 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలకు పరీక్షించే విధంగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
ఆర్.బి.ఎస్. కె ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే వైద్య పరీక్షలు వాటి పూర్తి వివరాలు గూగుల్ షీట్ లో పొందుపరచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏ.ఎన్.సి. నమోదు, ప్రసవాల పై సమీక్ష నిర్వహించారు.
వనపర్తి జిల్లాలో గత సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం మార్చి వరకు కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 715 సాధారణ ప్రసవాలు జరగటం పై వైద్య సిబ్బందిని అభినందించారు. ఇది చాలా గొప్ప ముందడుగు అని, దీనిని ఇదేవిధంగా కొనసాగించాలని సూచించారు. దీనివల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను అరికట్టడమే కాకుండా పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం పై భారం తగ్గించిన వారవుతారన్నారు. గ్రామాల్లో గర్భిణులకు సమయానికి ఎ.ఎన్.సి. నమోదు చేయడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖ ప్రసవాలు చేసే విధంగా గర్భిణీలు వారి కుటుంబ సభ్యులకు విశ్వాసాన్ని నెలకొల్పాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ రామచంద్ర రావు, డాక్టర్ పరిమళ, డాక్టర్ మంజుల పాల్గొన్నారు.
