
బీసీగురుకులంలోమిగిలిపోయిన సీట్లకునోటిఫికేషన్ విడుదల ప్రిన్సిపాల్ ఉషారాణి
నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం లోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకులంలో
6,7,8,9 తరగతి లో 2025-26, విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసంనోటిఫికేషన్ విడుదల అయ్యిందని కల్వకుర్తి బాలుర గురుకుల పాఠశాల, ప్రిన్సిపాల్
ఎం. ఉషారాణి తెలిపారు.ఆమె మాట్లాడుతూమహాత్మ జ్యోతిరావు పూలే బిసి వెల్ఫేర్ గురుకులపాఠశాలలో మిగిలి పోయిన సీట్లకు నోటిఫికేషన్ విడుదలై నట్లు ఈ అవకాశాన్ని కల్వకుర్తి నియోజకవర్గ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి.మార్చ్6 2025 నుండి మార్చ్ 31 వరకు ఉందని దరఖాస్తు ఫీజు రూ.150లు మాత్రమే అని ఆమెతెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 2025 రోజు పరీక్ష ఉంటుందని తెలిపారు. దరఖాస్తుచేసుకోవడానికి కావాల్సినవి భోనఫైడ్, ఆధార్ కార్డ్, అభ్యర్థి ఫోటో, సంతకం,ఫోన్ నెంబర్,ఇమెయిల్ ఐడి కుల ధ్రువీకరణ పత్రం,ఆదాయ ధ్రువీకరణ పత్రంఉండాలనిఆమెసూచించారు.
6వతరగతిప్రవేశానికి12సంవత్సరాలు మించకూడదని ఇందులో ఎస్సీ, ఎస్టి విద్యార్థులకురెండు సంవత్సరాలు సడలింపు ఉంటుందని ఆమె తెలిపారు.