TEJA NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

సీఎం చంద్రబాబుతో కలిసి.. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

క్రీస్తు మార్గాలను అనుసరిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడ మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్ర,ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ముందుగా క్రైస్తవ విశ్వాసులకు సీఎం చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ, కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవమన్నారు.

ఈ సందర్భంగా వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… తోటి వారి పట్ల ప్రేమ, కరుణ, దయతో ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారని తెలిపారు. ఆ మార్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు క్రిస్‌మస్‌ కేకును కట్‌ చేసి క్రైస్తవ మతపెద్దలకు తినిపించారు. ఎమ్మెల్యేలు మరియు మత పెద్దలు సీఎం చంద్రబాబుకు క్రిస్మస్ కేకు వినిపించారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు క్యాండిల్స్‌ చేతపట్టుకొని కీర్తనలు ఆలపించారు.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు ఫరూక్, సవిత, ఎంపీ కేశినేని చిన్ని,ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS