TEJA NEWS

దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వారి నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….. తెలంగాణలో రేవంత్ రెడ్డికి అభిమానంతో ఓట్లు వేసి ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు.


ప్రధాని మోదీ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసింది ఏమీ లేదని మణిపూర్ లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా చలణం లేకుండా ఉంటున్నారని ఎద్దేవ చేశారు. రాహుల్ ప్రధాని అవుతారేమో అన్న భయం మోడీకి పట్టుకుందన్నారు. కెసిఆర్ ఎస్సీలకు అన్యాయం చేశారని అందుకే ప్రజలు రేవంత్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో ఉన్నారని కచ్చితంగా విజయం సాధిస్తారని కడియం కావ్య వివాహంపై మందకృష్ణ మాదిగ లాంటి పెద్దలు అంచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలకు పెట్టింది పేరుగా నిలిచిందని వారి కుటుంబంలో ఎంతోమంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారని తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రం కోసం ఒకరైన ప్రాణాలు విడిచారా అని ప్రశ్నించారు.


బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బ్రతకడం చాలా కష్టంగా మారుతుందని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం మోడీ తరం కాదని ప్రజలు చూస్తున్నారని ప్రజలు న్యాయం వైపే ఉంటారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు అగ్నిపర్వతం లాంటి వారని వారి వల్లే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. దయచేసి ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ వారి స్థాయికి తగినట్టుగా మాట్లాడాలని అనవసర విమర్శలు చేసి దిగజారుడు రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS